calender_icon.png 11 January, 2025 | 9:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తమిళనాడు డ్రాగన్స్ విజయం

11-01-2025 12:00:00 AM

భువనేశ్వర్: హాకీ ఇండియా లీగ్ లో తమిళనాడు డ్రాగన్స్ మూడో విజయాన్ని అందుకుంది. రూర్కెలా వేదికగా జరిగిన మ్యాచ్‌లో తమిళనాడు 2-1తో బెంగాల్ టైగర్స్‌పై గెలుపొందింది. డ్రాగన్స్ తరఫున సెల్వమ్ (16వ ని.లో), ఉత్తమ్ (37వ ని.లో) గోల్స్ చేయగా.. రూపిందర్ (35వ ని.లో) బెంగాల్‌కు ఏకైక గోల్ అందించాడు.

ఐదు మ్యాచ్‌ల్లో మూ డు విజయాలు సాధించిన తమిళనాడు పాయింట్ల పట్టికలో అగ్రస్థా నానికి చేరుకోగా.. బెంగాల్ టైగర్స్ రెండో స్థానంలో ఉంది. నేడు జరగనున్న మ్యాచ్‌ల్లో హైదరాబాద్ తుఫా న్స్‌తో సూర్మా హాకీ క్లబ్, యూపీ రుద్రాస్‌తో ఢిల్లీ ఎస్‌జీ పైపర్స్ తలపడనున్నాయి.