12-04-2025 12:00:00 AM
చెన్నై, ఏప్రిల్ 11: తమిళనాడు అటవీ శాఖ మంత్రి పొన్ముడి వివాదాస్పద వ్యా ఖ్యలు చేశారు. పొన్ముడి హిందూ నామాల గురించి వి వాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఆయనపై అంతా భగ్గుమంటున్నారు. మహిళలు ఒక జోక్ చెబుతా ను అపార్థం చేసుకోకండి. అని ‘ఒక హిందువు ఒక వేశ్య వద్దకు వెళ్తాడు. అప్పడు ఆ వేశ్య అతడిని శైవుడా, వైష్ణవుడా అని అడుగుతుంది. అది అతడికి అర్థం కాకపోవడంతో ఆ మహిళ క్లారిటీనిస్తుంది.
అడ్డబొట్టు పెట్టుకుంటే శైవు లని, నిలువుబొట్టు పెట్టుకుంటే వైష్ణవులని చెబుతుంది. వ్యక్తి శైవుడయితే పడు కునే పొజిషన్, వైష్ణవుడ యితే లేచి నిలబడే పొజిషన్ ఉంటుందని ఆమె వివరిస్తుంది’ అని పేర్కొన్నారు. ఇప్పుడు ఈ జోక్‌పై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. బీజేపీ నేతలతో పాటు డీఎంకే ఎంపీ కనిమొళి కూడా మంత్రి వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. డీఎంకే పార్టీ జనరల్ సెక్రటరీ పదవి నుంచి పొన్ముడిని తొలగించి తిరుచి ఎన్. శివను నియమించింది.