07-04-2025 12:00:00 AM
తమన్నా భాటియా తన కెరీర్‌లో ఎంతో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుగా భావిస్తూ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ఓదెల 2’. ‘ఓదెల రైల్వేస్టేషన్’ సినిమాకు సీక్వెల్ ఇది. అశోక్‌తేజ దర్శకత్వంలో మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌వర్క్స్ పతాకంపై డీ మధు నిర్మిస్తున్నారు. తమన్నా నాగసాధువుగా కనిపించనున్న ఈ చిత్రంలో హెబ్బా పటేల్, వశిష్ఠ ఎన్ సింహా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఏ అప్‌డేట్ వచ్చినా ప్రేక్షకుల్లో అమిత ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఇటీవల విడుదల చేసిన టీజర్ సినీప్రియుల్లో అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్లింది. తాజాగా మేకర్స్ మరో అప్‌డేట్ ఇచ్చారు. ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్‌ను ఈ నెల 8న విడుదల చేయనున్నారు. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను ముంబయి నిర్వహించనున్నట్టు టీమ్ వెల్లడించింది. ఈ వేదికపై తెలుగు, హిందీ భాషల్లో రూపొందించిన ట్రైలర్‌ను లాంచ్ చేయనున్నారు. ఈ వేడుకకు కోర్ టీమ్ హాజరు కానునుందని యూనిట్ తెలిపింది. ఈ చిత్రానికి డీవోపీ: సౌందర్ రాజన్; సంగీతం: అజనీష్ లోక్‌నాథ్; ఆర్ట్: రాజీవ్ నాయర్.