calender_icon.png 23 February, 2025 | 8:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తమన్నా 4౦ డిగ్రీల ఎండలోనూ చెప్పుల్లేకుండా షూట్‌కొచ్చింది!

23-02-2025 12:46:24 AM

తమన్నా భాటియా ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ఓదెల 2’. అశోక్‌తేజ దర్శకత్వంలో డీ మధు నిర్మిస్తున్నారు. ఈ చిత్ర టీజర్ లాంచ్ ఈవెంట్‌ను శనివారం ప్రయాగ్‌రాజ్‌లోని మహా కుంభమేళాలో త్రివేణి సంగమం వద్ద నాగసాధువుల సమక్షంలో నిర్వహించారు.

తమన్నా మాట్లాడుతూ.. ‘మహాకుంభమేళా జీవితంలో ఒక్కసారే వస్తుంది. ఓదెల 2 సినిమా కూడా జీవితంలో ఒకేసారి వచ్చే అవకాశం. ఈ సినిమా నాకు చాలా ప్రత్యేకం. ఈ సినిమాతో పుణ్యం, డబ్బు రెండు కలిసి వస్తాయని భావిస్తున్నా. ఈ సినిమా ప్రారంభం నుంచీ ఏదో మ్యాజిక్ ఫీల్ అయ్యాం. ఇలాంటి టీజర్ లాంచ్ వన్స్ ఇన్ ఏ లైఫ్ టైమ్.

త్రివేణి సంగమం మధ్యలో నిలుచుని ఈ టీజర్‌ను అందరికీ సమర్పిస్తున్నాం. అందరూ థియేటర్లలో సినిమా చూస్తారని కోరుకుంటున్నా’ అన్నారు. సంపత్ నంది మాట్లాడుతూ.. ‘ఈ సినిమా ఆలోచన అవకాశం ఆ శివుడు ఇచ్చిందేనని నమ్ముతున్నా. తమన్నా ఈ సినిమా ఒప్పుకున్న తర్వాత నలభై డిగ్రీల ఎండలో కూడా కాళ్లకు చెప్పులు లేకుండా నటించింది.

సినిమా ఒప్పుకున్న తర్వాత మాంసాహారాన్ని మానేసింది. అమ్మోరు సినిమా చూసినప్పుడు సౌందర్యను, అరుంధతి సినిమా చూసినప్పుడు అనుష్కను ఎంత ఆరాధించమో.. తమన్నా ఈ సినిమాతో ప్రేక్షకుల హృదయాలకు అంత దగ్గర అవ్వాలని కోరుకుంటున్నా. అది తప్పకుండా జరుగుతుంది’ అన్నారు. డైరెక్టర్ అశోక్ తేజ, నిర్మాత మధు, యాక్టర్ వశిష్ట, మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ లోక్‌నాథ్ పాల్గొన్నారు.