calender_icon.png 25 October, 2024 | 2:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టాకీ పార్ట్ షురూ

25-10-2024 12:00:00 AM

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా ఓ యాక్షన్ థ్రిల్లర్ తెరకెక్కుతోంది. వర్కింగ్ టైటిల్ ‘ఎన్‌కేఆర్21’గా ప్రచారంలో ఉన్న ఈ చిత్రానికి ప్రదీప్ చిలుకూరి దర్శకుడు. సోహైల్ ఖాన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మాతలు. ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకొంటోంది. తాజాగా టీమ్, లీడ్ కాస్ట్ పాల్గొంటున్న కొత్త షూటింగ్ షెడ్యూల్‌ను వైజాగ్‌లో ప్రారంభించింది.

భారీ యాక్షన్ సీక్వెన్స్‌తోపాటు విజయ శాంతి, శ్రీకాంత్, సాయి మంజ్రేకర్, యానిమల్ పృథ్వీరాజ్‌ల టాకీ పార్ట్‌ను చిత్రీకరిస్తున్నారు. మేకర్స్ విడుదల చేసిన వర్కింగ్ స్టిల్‌లో కళ్యాణ్‌రామ్ ఆలోచిస్తున్నట్టు కనిపించగా, ప్రొడక్షన్ టీమ్ వారి టాస్క్‌లు చేస్తూ ఉన్నారు. 15 రోజుల పాటు సాగే ఈ షెడ్యూల్‌తో సినిమా మేజర్ పార్ట్ పూర్తవుతుంది. ఈ చిత్రానికి డీవోపీ: రామ్‌ప్రసాద్; సంగీతం: అజనీష్ లోక్‌నాథ్; స్క్రీన్ ప్లే: శ్రీకాంత్ విస్సా; ఆర్ట్ డైరెక్టర్: బ్రహ్మ కడలి; యాక్షన్: రామకృష్ణ, పీటర్ హెయిన్.