ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఎఫెక్ట్
హైదరాబాద్, ఫిబ్రవరి 10 (విజయక్రాంతి): ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ వల్ల తెలంగాణ ఆర్టీసీ జేఏసీతో ఆర్టీసీ యాజమాన్యం నిర్వహించతలపెట్టిన చర్చలు వాయిదాపడ్డాయి. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత చర్చలకు పిలుస్తామని కార్మిక శాఖ అధికారులు ఆర్టీసీ జేఏసీకి తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు, ఇతర కారణాలకు సంబంధించి ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో జనవరి 27న సమ్మె నోటీసును లేబర్ కమిషన్‌కు సమర్పించారు. ఈనెల 10న సాయంత్రం 4 గంటలకు కార్మిక శాఖ భవన్‌లో చర్చలకు రావాలని కార్మికులకు సూచించింది.