calender_icon.png 27 September, 2024 | 9:44 AM

ప్రధానితో మాట్లాడా.. కేంద్రం అండగా ఉంటుంది

09-09-2024 03:22:18 AM

  1. రాజకీయాలకు ఇది సమయం కాదు 
  2. సమైక్యంగా బాధితులను ఆదుకుందాం 
  3. స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలి 
  4. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి 

ఖమ్మం, సెప్టెంబర్ 8 (విజయక్రాంతి): ఖమ్మం వరద బాధితులను ఆదుకునే విషయమై ప్రధాని మోదీతో మాట్లాడానని, కేంద్రం అండగా ఉంటుందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం ఆయన ఖమ్మం జిల్లాలో ము ంపు ప్రాంతాలను పరిశీలించారు. బాధితులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఆ తర్వాత మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇది రాజకీయాలు చేసే సమయం కా దని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఐక్యంగా వర ద బాధితులకు సహాయక చర్యలు చేపట్టాలన్నారు. ఖమ్మం ప్రజల కష్టాలు చూస్తుంటే క న్నీళ్లు వస్తున్నాయని, ఇంతటి వితప్కర పరిస్థితి ఎన్నడూ ఎదురుకాలేదన్నారు.

సర్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలారని, పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటూ పడరా నిపాట్లు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశా రు. వారిని పూర్తిస్థాయిలో ఆదుకోవాలన్నా రు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌ను కూ డా ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధం గా ఉన్నదని చెప్పారు. తెలంగాణ గురించి ప్రధాని మోదీతోపాటు కేంద్ర హోంశాఖ మ ంత్రి అమిత్‌షాతో మాట్లాడినట్లు వెల్లడించా రు. తెలంగాణ ప్రభుత్వం వద్ద విపత్తు నిధు లు రూ.1,345 కోట్లు ఉన్నాయని, వాటితో యుద్ధప్రాతిపదికన అన్ని ప్రాంతాల్లో సహా య కార్యక్రమాలు చేపట్టాలని కోరారు.

అతి త్వరలో కేంద్ర బృందాలు రాష్ట్రంలోని ముంపు ప్రాంతాల్లో పర్యటించి, నివేదిక రూపొందిస్తాయని ఆ నివేదిక రాగానే కేంద్రం తన వంతు సాయాన్ని రాష్ట్రానికి  అందిస్తుందని కిషన్‌రెడ్డి వెల్లడించారు. విపత్తు నిధులకు సంబంధించి కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న మరో రూ.200కోట్లు విడుదలయ్యేలా చర్య లు తీసుకుంటానని అన్నారు. ఇందుకు సం బంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదిక అ ందాల్సి ఉందన్నారు. కాగా ఇల్లు కోల్పోయిన వారికి తాత్కాలిక పద్ధతిన ఆదుకోవాలన్నారు.

వంట సామగ్రి, నిత్యావసర వస్తువులు, గ్యాస్ ఇతర అవసరాలన్నీ తీర్చాలన్నా రు. విద్యార్థులకు పాఠ్యపుస్తుకాలు, నోట్ పు స్తకాలు అందజేయాలన్నారు. పభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు, అన్ని వర్గాల ప్రజలు   మానవతా దృక్పథంతో ముందు కు వచ్చి వరద బాధితులను ఆదుకోవాలని కిషన్‌రెడ్డి కోరారు. విపత్తు నిధుల విడుదల విషయంలో కేంద్రం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య బేధాన్ని చూపుతోందన్న విమ ర్శలను కిషన్‌రెడ్డి కొట్టిపారేశారు. 

వరద ప్రాంతాల్లో కిషన్‌రెడ్డి..

ఖమ్మం 16వ డివిజన్ పరిధిలోని ధ్వంసలాపురం అగ్రహారం కాలనీని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సందర్శించారు. కాలనీలో కూలిన ఇళ్లను పరిశీలించారు. ఆ తర్వాత మున్నేరు వాగును సందర్శించారు. అప్రమత్తంగా ఉండాలని కాల నీవాసులు, అధికారులకు సూచించారు. అక్క డే స్కూలులో ఏర్పాటు చేసిన పునరావాస కేం ద్రానికి వెళ్లి బాధితులతో మాట్లాడారు. కొంత మంది మహిళలు కిషన్‌రెడ్డి కాన్వాయ్‌కు అడ్డుపడి, బాధలు చెప్పుకున్నారు. ప్రభుత్వపరంగా ఎటువంటి సా యం అందలేదని, ఆదుకో వాలని కోరారు.

సాయం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కిషన్‌రెడ్డి అన్నారు.  పక్కనే ఉ న్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కలుగజేసుకుని మహిళలకు సర్దిజెప్పారు. బీజే పీ ఆధ్వర్యంలో ధ్వంసలాపురం అగ్రహారం కా లనీ, తిరుమలాయపాలెం మండలం రాకాసితండాలో నిత్యావసర వస్తువులు పంపిణీ చేశా రు. కిషన్‌రెడ్డి వెంట రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వరరెడ్డి ఉన్నారు.