సభ్యులు సుదీర్ఘ ప్రసంగాలు చేయొద్దు
స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ సూచన
హైదరాబాద్, జూలై 30 (విజయక్రాంతి): అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైన శాసనసభ మంగళవారం తెల్లవారుజామున 3.15 గంటల వరకు జరిగిందని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పేర్కొన్నారు. సభ్యలు సుదీర్ఘ ప్రసంగాలు చేయకుండా సబ్జెక్టుపైనే మాట్లాడాలని ఎమ్మెల్యేలకు సూచించారు. ప్రతి సభ్యుడికి 15 నిమిషాల సమయాన్ని ఇస్తున్నట్టు తెలిపారు. సమయాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలని, సభ సజావుగా జరిగేలా సహకరించాలని కోరారు.
19 పద్దులపై చర్చ
శాసనసభలో 19 పద్దులపై చర్చ ను స్పీకర్ ప్రారంభించారు. వ్యవసా యం, సహకార, నీటిపారుదల, ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్, రెవెన్యూ, రిజిస్ట్రేషన్లు, గృహనిర్మాణం, పౌరసరఫరాలు, పశుసంవర్ధక, పర్యాటక, క్రీడాశాఖ, అటవీ, దేవాదాయ, మైనా ర్టీ, చేనేత, స్త్రీ,శిశుసంక్షేమ శాఖ పద్దులపై చర్చను ప్రవేశపెట్టారు. వీటన్నిం టిపై చర్చ జరిగిన తర్వాత వీటిపై మంత్రులు సమాధానాలు ఇస్తారు.