calender_icon.png 3 January, 2025 | 1:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రతిభ చాటిన అల్ఫోర్స్ విద్యార్థి

22-12-2024 02:45:25 AM

కరింనగర్ సిటీ, డిసెంబర్21: హ్యాండ్ బాల్ కు  ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందినదని  ఒలింపిక్స్ లో ప్రత్యేకత కలిగినటువంటి క్రీడా  అని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి.నరేందర్ రెడ్డి  అన్నారు. అల్ఫోర్స్ ఐఐటి అకాడమీ ప్రాంగణంలో విద్యార్థి జాతీయస్థాయి పోటీలకు తెలంగాణ రాష్ర్టం నుండి ప్రాతినిధ్యం వహించినందుకు ప్రతిభ చాటినందుకు ఏర్పాటు చేసినటువంటి అభినందన సభకు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.

విద్యార్థులకు విద్యతో పాటు క్రీడ పట్ల ఆసక్తి కనబరిచే విధంగా నిపుణులైన వ్యాయామ అధ్యాపకులచే శిక్షణ ఇప్పిస్తూ వారికి ఇష్టమైన రంగంలో నైపుణ్యం సాధించే విధంగా ప్రోత్సాహం అందించడమే కాకుండా వివిధ స్థాయిలలో నిర్వహింపబడేటటువంటి పోటీలకు సైతం ఎంపిక చేసి అన్ని వనరులను కల్పిస్తున్నామని చెప్పారు. 

ఈ క్రమంలో  అకాడమీకు చెందినటువంటి పీ.పార్ధు రెడ్డి పంజాబ్‌లోని లుధియానాలో నిర్వహించినటువంటి జాతీయ స్థాయి హ్యాండ్ బాల్ పోటీలలో తెలంగాణ జట్టుకు ప్రాతినిధ్యం వహించి అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు వారు ప్రశంసించారు. అసమాన ప్రతిభను కనబరిచిన విద్యా ర్థికి పుష్పగుచాన్ని అందజేసి శుభాభినందనలు తెలియజేసి భవిష్యత్తులో మరిన్ని విజయాలను సాధించి క్రీడా స్పూర్తిగా కొనసాగించాలని ఆకాంక్షించారు.