అదనపు కలెక్టర్ దీపక్ తివారి...
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): ప్రతిభకు పదును పెట్టాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారి(Additional Collector Deepak Tewari) అన్నారు. ఇటీవల రాష్ట్రస్థాయిలో జరిగిన ఇన్స్ ఫైర్ పోటీలలో అత్యంత ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయికి ఎంపికైన విద్యార్థి సూరజ్ సోలంకిని మంగళవారం తన కార్యాలయంలో అభినందించాడు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ... విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. విద్యార్థుల ఆలోచనలను గమనించి వారిని ప్రోత్సహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి కటకం మధుకర్, ట్రాస్మా జిల్లా అధ్యక్షుడు దేవ భూషణం, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తదితరులు పాల్గొన్నారు.