calender_icon.png 23 April, 2025 | 10:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సత్తా చాటిన ఇంటర్ విద్యార్థులు

23-04-2025 12:00:00 AM

రాష్ట్రస్థాయిలో కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా సెకండ్ ఇయర్ ఫలితాల్లో రెండో స్థానం 

ఫస్ట్ ఇయర్‌లో నాలుగో స్థానం

కుమ్రం భీం ఆసిఫాబాద్, ఏప్రిల్ 22(విజయక్రాంతి): ఇంటర్మీడియట్ ఫలితాల్లో కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. రాష్ట్ర స్థాయిలో ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో 70.49 శాతంతో రాష్ట్రంలో నాలు గో స్థ్దానంలో నిలిచింది. సెకండ్ ఇయర్‌లో 79.02 శాతం ఫలితాలతో జిల్లా రాష్ట్రంలో ద్వితీయ స్థానంలో నిలిచింది.  గత ఏడాది రాష్ట్రంలో 8వ స్థానంలో నిలిచిన జిల్లా  విద్యార్థులు ఈసారి మెరుగైన ఫలితాలతో రాష్ట్రంలో రెండవ స్థానం సాధించారు.

ఇంటర్ విద్యార్థుల ప్రతిభ జిల్లాకే గర్వకారణం

ఇంటర్మీడియట్ ఫలితాల్లో రాష్ట్రస్థాయి లో కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా రెండవ స్థానంలో నిలవడం అభినందనీయమని  డీసీసీ ప్రెసిడెంట్  కొక్కిరాల విశ్వప్రసా ద్ రావు మంగళవారం ప్రకటనలో తెలిపారు.  వెనుకబడిన ఆదివాసి జిల్లాలో విద్యారంగా న్ని ముందుకు తీసుకువెళుతున్న అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. 

రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు..

నిర్మల్ ఏప్రిల్ 22 (విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని టీజీ సోఫీనగర్ గురుకుల కళాశాల విద్యా ర్థులు ఇంటర్మీడియట్ ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో ర్యాంకులు సాధించినట్లు ప్రిన్సిపల్ డేనియల్ తెలిపారు. మంగళవారం విడుదలైన ఫలితాల్లో బైపీసీ విభాగంలో రాథోడ్ అంజలి 993 అనిత 989, శ్రీనిధి 982 మార్కులు సాధించినట్లు తెలిపారు. ఎంపీసీ విభాగంలో ఆర్ ప్రియాం క 992 అవంతిక 991 అక్షయ 989 హర్షిని 989 సాధించినట్టు తెలిపారు. ప్రథమ సంవత్సరం పరీక్షల్లో అక్షయ 435 విజయలక్ష్మి 433 మార్కులు సాధించినట్లు వివరించారు, ఎంపీసీలో శార్వాణి 465 శ్రీవల్లి 470 సంధ్య 464 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలోనే మంచి మార్కులతో గుర్తింపు పొందడం జరిగిందని ప్రిన్సిపల్ డేనియల్ వెల్లడించారు.

మంచిర్యాల జిల్లా మెరుగు..

మంచిర్యాల, ఏప్రిల్ 22 (విజయక్రాంతి) : ఇంటర్ బోర్డు మంగళవారం విడుదల చేసిన వార్షిక పరీక్షా ఫలితాలలో ఈ ఏడాది సైతం బాలికలే సత్తా చాటారు. గత ఏడాదితో పోల్చితే ఫలితాలలో మంచిర్యాల జిల్లా కొంచెం మెరుగుపడిందని చెప్పవచ్చు. సెకండియర్ జనరల్‌లో (67.85 శాతం) 21వ స్థానం, వొకేషనల్‌లో (77.13 శాతం) 9వ స్థానంతో, ఫస్ట్ ఇయర్ జనరల్‌లో (54.48 శాతం) 26వ స్థానం, వొకేషనల్‌లో (61.68 శాతం) 14వ స్థానంతో సరిపెట్టుకుంది. ఇంటర్ మొదటి సంవత్సరం 54.48 శాతం ఉత్తీర్ణత సాధించి రాష్ట్ర స్థాయిలో 26వ స్థానంలో నిలిచారు. గత ఏడాదితో పోల్చితే కొంత మెరుగనే చెప్పవచ్చు.

మెరిసిన మోడల్ స్కూల్ విద్యార్థినీలు

మంచిర్యాల పట్టణంలోని రాజీవ్ నగర్ మోడల్ స్కూల్ విద్యార్థినీలు ఇంటర్ వార్షిక ఫలి తాలలో మంచి ప్రతిభ కనబర్చినట్లు కళాశాల ప్రిన్సిపాల్ ముత్యం బుచ్చన్న తెలిపారు. పీ రిశ్విత ఎంపీసీ ఫస్ట్ ఇయ ర్‌లో 465 మార్కులతో జిల్లా స్థాయి ర్యాంకు సాధించింది. మంచర్ల సుస్మిత సీఈసీలో 480 మార్కులు, డీ హన్షిక బైపీసీలో 418 మార్కులు సాధించా రు. విద్యార్థులను కళాశాల అధ్యాపక బృం దం అభినందించారు.

ఇంటర్ ఫలితాల్లో ఎస్‌ఆర్‌ఆర్ ప్రభంజనం

మంచిర్యాల, ఏప్రిల్ 22 (విజయక్రాంతి): ఇంటర్ పరీక్షా ఫలితాలలో పట్టణంలోని ఎస్‌ఆర్‌ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలతో రాణించినట్లు కళాశాల చైర్మన్ పెట్టం మల్లేశ్ వెల్లడించారు. ద్వితీయ సంవత్సరం ఎంపీసీ విభాగంలో సీహెచ్ వాగ్గేవి (988), ఏ సాయి దివ్య (987), జీ అశ్వల (982), బీ శృతి (981), బైపీసీ విభాగంలో ఎం మనోజ్ఞ (982), సాకేత్ రాం (974), సీహెచ్ హన్షిక (973), సీఈసీ విభాగంలో డీ రంజిత్ (979), సీహెచ్ సాయి మాధవి (933), డీ శివాని (930) మార్కులు సాధించారు. మొదటి సంవత్సరం ఫలితాలలో ఎంపీసీ విభాగంలో ఎం శివనందిని (463), కే వైష్ణవి (461), ఎం ఆవిష్కర్ (460), బైపీసీలో కే ఆశ్రయ (429), టీ దివ్య (426), ఎం అమూల్య (419), బీ జెస్సికా ప్లోరా (418), సీఈసీలో ఏ రాజేశ్ (490), కే అక్షయ (486), ఆర్ శృతి (471)లు రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులను కరస్పాండెంటు రమణ, కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్, డైరెక్టర్ లు శ్రీకర్, మానయ్య, రాజు , అధ్యాపక బృందం అభినందించారు.