22-04-2025 07:35:07 PM
ఎల్లారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల విద్యార్థుల మెరుగైన ఫలితాలతో ఆకట్టుకున్నారు. ఎల్లారెడ్డి తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల విద్యార్థుల పరీక్ష ఫలితాలు ఈరోజు విడుదలయ్యాయి. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ జి నాగేశ్వరరావు ఫలితాలను మీడియాతో పంచుకున్నారు. ప్రథమ సంవత్సరంలో బైపీసీ విభాగంలో మధుసూదన్ 383 మార్కులతో ఉన్నంత శ్రేణిలో నిలిచాడు. అదేవిధంగా ఎంపీసీ విభాగంలో యు హేమంత్ 379 మార్కులతో ప్రతిభ చూపాడు.
ద్వితీయ సంవత్సరంలో విద్యార్థులు మరింత మెరుగైన ఫలితాలను సాధించారు. బైపీసీ విభాగంలో కె భానుచందర్ రెడ్డి 951, జి ప్రమోద్ 951 మార్కులతో ప్రథమ స్థానంలో నిలిచారు, ఎంపీసీ విభాగంలో కె లోకేష్ 918 మార్కులతో అత్యున్నత ఫలితాలను సాధించాడు. ద్వితీయ సంవత్సరంలో మొత్తం ఉత్తీర్ణత శాతం 83.33% గా నమోదయింది. మా కళాశాల విద్యార్థులు చదువులో ప్రతిభ చూపటం గర్వకారణం, ప్రతి విద్యార్థి కష్టపడి చదివి మంచి ఫలితాలు సాధించాలని కోరుకుంటున్నానని ప్రిన్సిపాల్ నాగేశ్వరరావు తెలిపారు. విద్యార్థులు తల్లిదండ్రులు, అధ్యాపకులు ఈ విజయాన్ని సంతోషంగా జరుపుకుంటున్నారు.