06-03-2025 05:34:52 PM
నిర్మల్ (విజయక్రాంతి): ఇటీవల హైదరాబాద్ లో జరిగిన ఆంగ్లభాష ప్రావీణ్యత అంశంలో నిర్మల్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన విద్యార్థులు ప్రతిభ సాధించినట్లు ప్రిన్సిపల్ సుధాకర్ తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ జిల్లాలకు చెందిన విద్యార్థులు ఆంగ్లభాష ప్రాథమిక అనే అంశంపై నిర్వహించిన ప్రదర్శనల్లో నిర్మల్ విద్యార్థులు ప్రతిభ సాధించినట్లు తెలిపారు. వారికి ప్రశంస పత్రాలను అందించగా గురువారం కళాశాలలో విద్యార్థులను గైడ్లు రజిత మహేందర్ పాఠశాల అధ్యాపకులు అభినందించారు.