10-03-2025 11:53:31 AM
మంథని,(విజయక్రాంతి): జాతీయ స్థాయి కరాటే పోటీల్లో(National level karate competition) మంథని కరాటే విద్యార్థులు ప్రతిభ చాటారు. పెద్దపల్లిలోని ఎంబి గార్డెన్ లో ఆదివారం నిర్వహించిన జాతీయస్థాయి కరాటే పోటీల్లో శిక్షకులు కావేటి సమ్మయ్య ఆధ్వర్యంలో మంథనికి చెందిన జపాన్ షిటోరియో కరాటే అకాడమీ విద్యార్థులు సబ్ జూనియర్స్ కథ, కుమితే విభాగంలో బంగారు వెండి కాంస్య పథకాలు సాధించారు. బండారి మణికంఠ, ఎం శివ, బాసాని మనీ హర్, డి అక్షిత బంగారు, వెండి పథకాలు సాధించారు. జడగాల మనస్వి వి అద్వితి కాంస్య పథకాలు సాధించిన వారిని, జడగల సహస్ర బొగ్గుల మనోజ్ఞ పథకాలు సాధించిన వారిని జపాన్ షిటోరియు కరాటే జాతీయ ఉపాధ్యక్షులు పాలకుర్తి పాపయ్య, రాష్ట్ర కార్యనిర్వాన అధ్యక్షుడు గుంటుపల్లి సమ్మయ్య, ఇన్స్ట్రక్టర్స్ నా గిల్లి రాకేష్, జడగల శివాని, కావేటి శివ గణేష్, మెట్టు హాసిని లు విద్యార్థులను అభినందించారు.