పెద్దకోడప్ గల్ ఫిబ్రవరి 9 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా పెద్ద కొడఫ్గల్ మండలం కాటేపల్లి గ్రామ ప్రభుత్వ పాఠ శాల విద్యార్థులు హైదరాబాద్లో నిర్వహిం చిన న్యూ డ్రాగన్ ఫైటర్స్ మార్షల్ ఆరట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ కరాటే, కుంపూ పోటీ లు నిర్వహించారు.
ఈ పోటీ లు ఆదివారం నిర్వహించగా కాటేపల్లి విద్యార్థులు అంతర్జాతీయ క్రికెట్ పోటీల్లో ఉత్తమ ప్రతిభను కనబరిచారు. పోటీల్లో విద్యార్థులు ఉత్తమ ప్రతిభను చూపించి పలు పతకాలను సాధించారు. ఈ పోటీలో పాల్గొన్న విద్యార్థులను, కరాటే మాస్టర్ మాట్లాడుతూ పిల్లలకు చదువు తో పాటు క్రీడా రంగాలలో పాల్గొంటే శారీరకంగా మానసికంగా దృఢంగా ఉంటారన్నారు. విద్యార్థులను గ్రామస్థులు అభినందించారు.