calender_icon.png 29 November, 2024 | 7:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాతీయ, రాష్ట్రస్థాయి పోటీల్లో భద్రాద్రి కొత్తగూడెం విద్యార్థుల ప్రతిభ

29-11-2024 06:07:41 PM

అభినందనలు తెలిపిన కలెక్టర్...

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పాల్వంచ స్కూల్ గేమ్ ఫెడరేషన్ (ఎస్ జి ఎఫ్ )పోటీలలో అండర్ 17 బాలురుల విభాగంలో శ్రీవిద్య స్కూలుకు చెందిన పి నోయల్ విన్సెంట్ జాతీయస్థాయి పోటీల్లో ఫెన్సింగ్ విభాగంలో తెలంగాణ రాష్టానికి బ్రాంజ్ మెడల్ సాధించారు. అదేవిధంగా జూడో, నెట్ బాల్, బ్యాట్మెంటన్, హ్యాండ్ బాల్ రాష్ట్రస్థాయి పోటీలలో పథకాలు సాధించడం జరిగినది. అండర్ 14 బాలికల విభాగంలో శ్రీవిద్య స్కూల్ కు చెందిన గరిడేపల్లి భావన కీర్తిక, నవభారత్ పబ్లిక్ స్కూల్ పాల్వంచకు చెందిన విద్యార్థులు రోడా గ్రీస్ బ్యాడ్మింటన్, ఫెన్సింగ్, జూడో విభాగాలలో అత్యుత్తమ ప్రతిభను కనబరిచారు.

ఎస్ జి ఎఫ్ విద్యార్థులను జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ జితేష్ బి.పాటిల్ ని శుక్రవారము కలిశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విద్యార్థులను అభినందించి, తాను మాట్లాడుతూ.. క్రీడ నైపుణ్యతను తెలుపుతూ, క్రీడల పట్ల అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని డివై ఎస్ ఓ, నూతన ఒలంపిక్ కమిటీకి తెలియజేశారు. పిల్లల ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా డివైఎస్ఓ పరంధామ రెడ్డి, ఒలంపిక్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ యుగంధర్ రెడ్డి ఉపాధ్యక్షులు వై వెంకటేశ్వర్లు, ఎస్ జి ఎఫ్ సెక్రెటరీ నరేష్, తల్లిదండ్రులు పాల్గొన్నారు.