19-02-2025 01:26:12 AM
మంథని, ఫిబ్రవరి 18(విజయక్రాంతి): గోదావరిఖని గాంధీ నగర్‌లో గల (ఎండి హె డబ్లుఎస్) బాలల సంరక్షణ కేంద్రం లోని పిల్లలు రాష్ర్ట స్థాయి కరాటే పోటీలలో అత్యంత ప్రతిభ చాటారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఈనెల 16వ తేదీన స్పార్క్ కుంగ్ - ఫు అకాడమీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ర్టస్థాయి కరాటే ఛాంపియన్షిప్ -2025 పోటీలలో పాల్గొని గోల్డ్, సిల్వర్ మెడల్స్ సాధించారు.
కాగా, ఈ పోటీలలో జి రామ్ ( గోల్డ్ మెడల్ ), జి లక్ష్మణ్ (గోల్డ్ మెడల్), ఎం శ్యాంప్రసాద్ (గోల్డ్ మెడల్ ), ఏ జగదీష్ (గోల్డ్ మెడల్), సంజీవ్ కుమార్ (సిల్వర్ మెడల్), రక్షిత్ ( సిల్వర్ మెడల్ ) సాధించారు. ఈ మేరకు రాష్ర్ట ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పిల్లలను అభినందిస్తూ మెడల్స్ తో సత్కరించారు. చిన్నతనంలోనే నా అనే వారిని కోల్పోయి విధి వంచితులైన అనాధ పిల్లలను చేరదీసి వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దుతున్న ఆశ్రమ నిర్వాహకులు పోచంపల్లి రాజయ్య ను ప్రత్యేకంగా అభినందించారు. ఆశ్రమ పిల్లల కోసం తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ట్రేడింగ్ యూనియన్ కార్పొరేషన్ చైర్మన్ అయితే ప్రకాశ్ రెడ్డి, మరియు పెద్దపల్లి జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు కోలేటి మారతి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఆయిలి ప్రసాద్, మంథని తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ పెండ్రూ రమాదేవి, సింగల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్, రాష్ర్ట నాయకులు శశి భూషణ్ కాచే, మాజీ ఎంపీపీ కొండ శంకర్, మాజీ ఏఎంసీ చైర్మన్ ఆకుల కిరణ్, కాంగ్రెస్ నాయకులు మరియు ఆశ్రమ వ్యవస్థాపకులు పెద్దపెల్లి జిల్లా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కమిటీ సభ్యులు పోచంపల్లి రాజయ్య ఆశ్రమ పిల్లలు పాల్గొన్నారు.