calender_icon.png 24 December, 2024 | 5:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రదర్శనలతోనే ప్రతిభా వెలికితీత

23-12-2024 10:12:55 PM

నిర్మల్ (విజయక్రాంతి): విద్యార్థులకు ప్రతిభా ఆధారంగా ప్రదర్శనలు ఏర్పాటు చేయడం వల్ల విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకత బయటకు వస్తుందని జిల్లా విద్యాశాఖ అధికారి రామారావు అన్నారు. పట్టణంలోని టీఎన్జీవో కార్యాలయంలో సోమవారం ఫిజికల్ సైన్స్ ప్రదర్శనశాలను ప్రారంభించారు. విద్యార్థులు తయారుచేసిన ప్రదర్శనలను అడిగి తెలుసుకున్న ఆయన అన్ని రంగాల్లో ప్రోత్సహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు నరసయ్య, మోహన్ రావు, మహేష్, వినోద్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.