26-04-2025 06:39:19 PM
నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలోని బీసీ సంక్షేమ శాఖ వసతి గృహంలో చదివి ఇంటర్లో అత్యుత్తమ మార్కులు సాధించిన ఇద్దరు విద్యార్థులకు శనివారం హైదరాబాదులో ప్రతిభ పురస్కారం పదివేల నగదును అందుకున్నారు. బీసీ సంక్షేమ కార్యాలయంలో జరిగిన ప్రతి కార్యక్రమంలో ఇంటర్మీడియట్ చదువుతున్న జి మదన్ వెయ్యి మార్కులకు 968 రావుల అనిత 926 మార్కులు సాధించడంతో ఈ ప్రతిభ దక్కింది. విద్యార్థులకు ప్రశంసా పదంతో పాటు ఒక్కొక్కరికి పదివేల చొప్పున ఆర్థిక సాయం అందుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారి శ్రీనివాస్ వార్డెన్ యోగేష్ అధికారులు పాల్గొన్నారు.