అందించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి
నిజామాబాద్, ఆగస్టు 3 (విజయక్రాంతి): పదో తరగతి వార్షిక పరీక్షల్లో టాపర్లుగా నిలిచిన ఆర్మూర్ పట్టణంలోని నాలుగు ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులకు శనివారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి బంగారు, వెండి పతకాలు, అవార్డులు అందజేశారు. తన తల్లిదండ్రుల పేరుమీద నెలకొల్పిన చిట్ల జీవన్‌రాజ్, ప్రమీల మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అందజేశారు. విద్యతో విజ్ఞానం విలువలు పెంపొందించుకోవాలని, అప్పుడే ఉన్నత శిఖరాలు అధిరోహించి లక్ష్యాలను సాధించుతారని ఈ సందర్భంగా పార్థసారథి అన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు, ఆర్మూర్ ఆర్డీవో రాజగౌడ్, డీఈవో దుర్గాప్రసాద్ పాల్గొన్నారు.