27-04-2025 08:50:21 PM
బాన్సువాడ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ఒకేషనల్ MPHW(F) విద్యార్థిని పి.పౌర్ణమి (966/1000) ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచింది. ఆదివారం హైదరాబాద్ లో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఇంటర్మీడియట్ ప్రతిభ పురస్కారాలు 2024-25 కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారిచే సన్మానం, అవార్డు, రూ 10,000/- ల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి షేఖ్ సలాం, బాన్సువాడ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ అసద్ ఫారూఖ్, సిబ్బంది విద్యార్థిని పౌర్ణమిను అభినందించారు.