calender_icon.png 6 January, 2025 | 2:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వివాదాస్పదంగా మారిన అడ్డ రోడ్డు చౌరస్తా

04-01-2025 11:12:39 AM

తలకొండపల్లి,(విజయక్రాంతి): తలకొండపల్లి మండలం అడ్డ రోడ్డు చౌరస్తా వివాదాస్పదంగా మారింది. చౌరస్తాలో నాయకుల విగ్రహాల ఏర్పాటుకు రాజకీయ పార్టీలు, కులసంఘాల వారు ముందుకు రావడంతో వివాదం తలెత్తింది. గత సంవత్సరం డిసెంబర్ 25న బీజెపీ జాతీయ నాయకుడు, దేశ మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్ పేయి(Atal Bihari Vajpayee) జన్మదినం సందర్భంగా అడ్డ రోడ్డు చౌరస్తాకు వాజ్ పాయి చౌరస్తాగా నామకరం చేస్తూ విగ్రహం ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. డిసెంబర్ 31న మండల దళిత సంఘాల నాయకులు అంబేద్కర్ చౌరస్తాగా నామకరణం చేస్తూ అంబేడ్కర్ చిట్రపటాన్ని ఏర్పాటు చేశారు. ఇద్దరు పొటాపోటీగా విగ్రహాల ఏర్పాటుకు ప్రయత్నిస్తుండగా మద్యలో గిరిజన నాయకులు ఎంటరై చౌరస్తాలో గిరిజనుల ఆరాద్య దైవం సంత్ సేవాలాల్ విగ్రహం(Sant Sevalal Maharaj) ఏర్పాటుకు అనుమతులు ఇవ్వాలంటూ గురువారం గిరిజ సంఘాల నాయకులు మండల తహశీల్దార్ నాగార్జునకు వినతిపత్రం అందజేశారు.

చౌరస్తాలో ప్రతి సంవత్సరం సేవాలాల్ జయంతిని జరుపుతున్నామని,సేవాలాల్ విగ్రహం ఏర్పాటుకు తమకు ప్రజా ప్రతినిధులు హామి ఇచ్చినట్లు గిరిజలు చెపుతున్నారు. ముగ్గురు తమ తమ నాయకుల విగ్రహాల ఏర్పాటుకు ముందుకు రావడంతో చౌరస్తా వివాదాస్పదంగా మారింది.విషయం తెలుసుకున్న అదికార పార్టీ నాయకులు నాగర్ కర్నూల్ ఎంపి మల్లు రవి, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి(Kalwakurthy MLA Kasireddy Narayan Reddy),రాష్ట్ర పొల్యుషన్ బోర్డ్ మెంబర్ బాలాజీసింగ్ లు గురువారం రాత్రి అడ్డ రోడ్డు చౌరస్తాకు చేరుకుని పరిశీలించి దళిత సంఘాల నాయకులతో, గిరిజన నేతలతో మాట్లాడారు.సమస్యను సామరస్యంతో పరిష్కరించుకోవాలని సూచించారు.విగ్రహాల ఏర్పాటు కోసం పరస్పరం వివాదాస్పదం కావద్దని కోరారు. దళితులు,గిరిజనులు ప్రభుత్వానికి రెండు కళ్లని వారి మద్య వివాదాలు మంచిదికాదని అన్నారు. చౌరస్తాలో విగ్రహాల ఏర్పాటు విషయమై సంబందిత ఆర్ అండ్ బి అదికారులతో మాట్లాడుతామని అప్పటి వరకు ఇరువురు సామరస్యంగా ఉండాలని నాయకులు విజ్ణప్తి చేశారు.ఎది ఎమైనా ముగ్గురి మద్య విగ్రహాల ఏర్పాటు విషయంలో అడ్డ రోడ్డు చౌరస్తా వివాదాస్పదంగా మారటంతో ఎం జరుగుతుందోనని మండల ప్రజలు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.