calender_icon.png 19 April, 2025 | 3:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం నేరం!

10-04-2025 12:00:00 AM

నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఐపీఎస్ 

నిజామాబాద్, ఏప్రిల్ 9 (విజయ క్రాంతి): నిజామాబాద్ జిల్లాలో నీ పలు గ్రామాలలో గ్రామాభివృద్ధి కొరకు ఏర్పడిన కమిటీలు, ఇప్పుడు చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తూ ప్రజలను బెదిరించడం, డబ్బులు వసూలు చేయడం వంటి కార్యకలాపాలకు పడుతున్నాయని. గ్రామ అభివృద్ధి కమిటీలు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడం నేరమని జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అన్నారు.

జరిమాణాలు విధించడం కుల బహిష్కరణలకు పాల్పడడం సాంఘిక అవమానాలు జరపడం సాంఘిక అవమానాలకి పౌరులను గురి చేయడం వంటి సంఘటనలకు పాల్పడితే కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన జిల్లాలోని  గ్రామాభివృద్ధి కమిటీలను హెచ్చరించారు. సివిల్, భూ, కుటుంబ తగాదాలను రామా అభివృద్ధి కమిటీలు పంచాయితీల పేరుతో పరిష్కరించేందుకు పాల్పడుతున్నారనీ వీరి మాటనుఎవరైనా వినకపోతే బహిష్కరణలతో భయబ్రాంతులకు గురిచేస్తున్నారనీ ఇలా చేయడం నేరమని కేసులు నమోదు చేస్తామని వీడీసీలను సిపి హెచ్చరించారు.

బెల్టు షాపులు, కోడి గుడ్డు ధరలకు వేలం, షాపులపై నియంత్రణలు విధిస్తూ డబ్బులు వసూలు చేయడం వంటి చర్యలు పూర్తిగా చట్టవ్యతిరేకం అని ఇలాంటి సంఘటనకు పాల్పడిన వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించమని గ్రామ అభివృద్ధి కమిటీలు గ్రామ అభివృద్ధికి పాటుపడాలి గాని ఇటువంటి చర్యలకు పాల్పడకూడదని తమ తీరును మార్చుకోకపోతే గ్రామస్తులను భయభ్రాంతులకు గురి చేస్తున్న వీడీసీలపై కేసు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించార.

భారతదేశం లో ప్రతి ఒక్కరూ చట్టాల ప్రకారమే జీవించాలి. ఎవరికైనా సమస్యలుంటే సంబంధిత అధికార శాఖలను సంప్రదించాలి. గ్రామాభివృద్ధి కమిటీలు చట్టస్థానాన్ని భ్రమింపచేసే ప్రయత్నం చేస్తున్నారని ఇలాంటి చర్యలకు పాల్పడవద్దని ఆయన వీడిసి కమిటీలకు సూచించారు.

తనిజామాబాద్ జిల్లాలో ఇకపై ఇలాంటి చర్యలు, బహిష్కరణలు జరిపిన పక్షంలో చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటాం. ఎవ్వరినీ ఉపేక్షించ బోమని విడిసి లను సిపి సాయి చైతన్య తీవ్రంగా హెచ్చరించారు.