బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ మేనల్లుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు ఇమ్రాన్ ఖాన్. 2015 నుంచి చిత్ర పరిశ్రమకు దూరంగా ఉన్న ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. యాక్టింగ్ కెరీర్ ప్రారంభించిన సమయంలో తాను ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నానని తెలిపారాయన. బీటౌన్ నటుడిగా రాణిస్తానో లేదోనన్న భయం తనను ఎప్పు డూ వెంటాడేదని చెప్పుకొచ్చారు. ‘ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉంటే ఫేమ్ మాత్రమే కాదు.. చాలా ఇబ్బందులూ ఎదుర్కోవాల్సి వస్తుంది. గతంలో నటీమణులే చర్మ సౌందర్యంపై దృష్టి సారించేవాళ్లు. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. శారీరక ఆకృతి విషయంలో నటులు కూడా తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారు.
లుక్స్ విషయంలో పురుషులకు కూడా ఒత్తిడి ఉంటుంది.. ఎప్పుడూ అందంగా కనిపించాలని వారూ అనుకుంటారు. ఇందుకోసం జాగ్రత్తలు పాటిస్తుంటారు. కొన్నిసార్లు తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురిచేస్తుంది. నేను నటుడిగా ఉన్నప్పుడు సిక్స్ ప్యాక్ బాడీతో సూపర్ హీరో లుక్‌లో కనిపించడం కోసం స్టెరాయిడ్స్ తీసుకున్నా. అయితే, శరీరాన్ని నిలబెట్టుకోవటంలో అలాంటి రసాయనాలు పనిచేయవని ఆఖరికి గ్రహించా’ అని చెప్పాడు ఇమ్రాన్.