calender_icon.png 18 January, 2025 | 10:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రూ.3వేలు లంచం తీసుకుంటూ..

18-01-2025 01:44:15 AM

* ఏసీబీకి పట్టుబడిన ఈఎన్‌టీ సీనియర్ అసిస్టెంట్ 

హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 17 (విజయక్రాంతి): రూ.3వేలు లంచం తీసు  కోఠి ఈఎన్‌టీ దవాఖాన సీనియర్ అసిస్టెంట్ ఆర్.సంతోష్ తివారీ శుక్రవారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. పదవీ వీరమణ (రిటైర్మెంట్ బెనిఫిట్స్) ప్రక్రియ కోసం ఓ ఉద్యోగి నుంచి రూ. 20 వేలు లంచం డిమాండ్ చేసి రూ.17 వేలకు అంగీకరించాడు.

ఈ క్రమంలో బాధితుడి ఫిర్యాదు మేరకు ఆస్పత్రి వద్ద ఏసీబీ అధికారులు  శుక్రవారం మధ్యాహ్నం 1.30 గంటలకు రూ.3 వేలు లంచం తీసుకుంటుండగా సంతోష్ తివారీని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితుడిని అరెస్టు చేసి నాంపల్లి ఏసీబీ కోర్టు ముందు హాజరుపర్చారు.