శిక్షణలో నేర్చుకున్న వాటిని విధుల్లో అమలు పర్చాలి
జిల్లా ఇంచార్జి పోలీస్ కమిషనర్ సీ. హెచ్. సింధూశర్మ...
నిజామాబాద్ (విజయక్రాంతి): ప్రత్యేక శిక్షణ పొందిన వారు శాంతి భద్రతల పరిరక్షణలో ముందుండాలని జిల్లా ఇంచార్జి పోలీస్ కమిషనర్ సింధుశర్మ అన్నారు. శుక్రవారం నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి ఏడవ బెటాలియన్‌లో శిక్షణ పొందిన కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ కార్యాక్రమానికి ముఖ్య అతిథిగా హజరై ఆమె మాట్లాడారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలను విధుల్లో అమలు పర్చాలని సూచించారు. 9 నెలల పాటు శిక్షణ పొందిన ప్రత్యేక పోలీస్ కానిస్టేబుల్ ముగింపు కార్యక్రమానికి హజరై శిక్షణ పొందిన వారి అవుట్ పరేడ్‌ను తిలకించారు. 463 మంది ఎస్‌సి, టిపిసిఎస్(టిజిఎస్‌పి లకు 2024 దీక్షాంత్ పరేడ్) ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శిక్షణ పొందిన పోలీసులకు పోలీస్ కమిషనర్ సింధూశర్మ ప్రశంస పత్రాలను అందజేశారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారికి మోమోంటోలను అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రత్యేక పోలీస్ 7వ బెటాలియన్ కమాండెంట్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.