calender_icon.png 6 January, 2025 | 8:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భోజనం తర్వాత పిల్లలను తీసుకెళ్లండి!

13-12-2024 12:17:42 AM

  1. బడికి గైర్హాజరైన ఉపాధ్యాయుడి సమాధానం ఇది..
  2. విద్యార్థుల చదువులు గాలికి.. టీచర్లు సొంత పనులకు..
  3. కుందారం తండాలో వెలుగు చూసిన ఘటన

నాగర్‌కర్నూల్, డిసెంబర్ 12 (విజయక్రాంతి): ఆ బడిలో మొత్తం విద్యార్థులు 14 మంది. వారు బడికి వచ్చినా రాకున్నా ఉపాధ్యాయులకు పట్టింపే లేదు. వచ్చిన వారికి పాఠాలు చెప్పే నాథుడు ఉండడు. విద్యార్థులు తూతూమంత్రంగా బడికి వస్తే, వారిని మధ్యాహ్నం వరకు అరకొర చదువులు చెప్పి.. మధ్యాహ్నం భోజనం పెట్టి ఇంటికి పంపుతున్నారు.

ఏరోజుకా రోజు మమ అనిపిస్తున్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండలం కుందారం తండాలలోని ప్రాథమి క పాఠశాలలో చదువుతున్న మొత్తం విద్యార్థులు 14. ఉపాధ్యాయులు విద్యార్థులు హాజరు గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు. ఈ క్రమంలో గురువారం కేవలం ఐదుగురు విద్యార్థులే హాజరయ్యారు.

కనీసం వాచ్‌మెన్, స్వీపర్లు కూడా రాలేదు. దీంతో విద్యార్థులే పాఠశాల గదులు తెరిచారు. చీపుర్లు చేతబట్టి తరగతి గదులను శుభ్రం చేసుకున్నారు. తర్వాత కూడా ఉపాధ్యాయులు రాలేదు. గ్రామస్తులు ఓ ఉపాధ్యాయుడికి ఫోన్ చేయగా.. ‘పిల్లలు మధ్యాహ్న భోజనం తిన్న తర్వాత  ఇంటికి తీసుకెళ్లండి’ అంటూ బదిలిచ్చినట్లు తెలిసింది.

దీనిపై స్కూల్ కాంప్లెక్స్ హెచ్‌ఎం శ్రీనివాసులును వివరణ కోరగా.. సదరు పాఠశాలలో ఇప్పటివరకు ఎలాంటి సమస్యలు లేవని బదులివ్వడం కోసమెరుపు. ఉపాధ్యా యులునెలల తరబడి పాఠశాలకు డుమ్మాలు కొడుతున్నప్పటికీ హెచ్‌ఎం అలా సమాధానమివ్వడంపై గ్రామస్తులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. చదువులు చెప్పాల్సిన టీచర్లు సొంతపనులకు వెళ్తున్నారని, పిల్లలకు  పాఠాలు చెప్పడం లేదని వాపోతున్నారు.