calender_icon.png 1 January, 2025 | 5:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వంతెన నిర్మాణానికి చొరవ చూపండి

02-08-2024 01:15:06 AM

ఏపీ సీఎంను కోరిన అచ్చంపేట ఎమ్మెల్యే

నాగర్‌కర్నూల్, ఆగస్టు 1 (విజయక్రాంతి): తెలంగాణ, ఏపీ సరిహద్దు ప్రాంతాల్లోని మాచర్ల దేవస్థానం వరకు హైలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి చొరవ చూపాలని కోరుతూ అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ గురువారం ఏపీ సీఎం చంద్రబాబుకు వినతిపత్రాన్ని అందజేశారు. గురువారం శ్రీశైల దర్శనానికి వచ్చిన చంద్రబాబును ఎమ్మెల్యే కలిసి విన్నవించారు. శ్రీశైలం పాలక మండలిలో తెలంగాణ ప్రాంతవారికి అవకాశం ఇవ్వాలని, తెలంగాణ అతిధి గృహ నివాసానికి స్థలం కేటాయించాలని కోరారు. నల్లమల చెంచులకు ఆరాధ్య దైవమైన మల్లికార్జున భ్రమరాంబిక చెంతన చెంచులకు ఉపాధి అవకాశాలను కల్పించాలని కోరారు. అనంతరం నల్లమల టైగర్‌తో కూడిన జ్ఞాపికను అందజేశారు.