calender_icon.png 29 November, 2024 | 5:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నగదు తీసుకో.. వేలిముద్ర వేసిపో!

29-11-2024 12:59:30 AM

  1. రేషన్ దుకాణాల్లో డీలర్ల దందా 
  2. రైస్‌మిల్లులకు తరలుతున్న రేషన్ బియ్యం
  3. నిద్రావస్థలో ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు

మెదక్, నవంబర్ 2౮ (విజయక్రాంతి): మెదక్ జిల్లాలో ప్రజా పంపిణీ వ్యవస్థ గాడి తప్పుతోంది. అక్రమార్జన కోసం రేషన్ డీలర్లు కొత్తదారులు వెతుకున్నారు. రేషన్ షాప్‌లకు వచ్చే లబ్ధిదారులకు ఏమాత్రం సంకోచం లేకుండా బియ్యం కొనుగోలు చేస్తారా? అని నేరుగా అడుగు తున్నారు.

వేలిముద్ర వేయించుకొని వారికి బియ్యం ఇవ్వకుండా ఎంతోకొంత డబ్బులిచ్చి పంపుతున్నారు. ఇలా సేకరించిన బియాన్ని నేరుగా రైస్‌మిల్లులకు తరలిస్తున్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు మాత్రం పట్టనట్లు వ్యవహరిస్తున్నారు.

సగం బియ్యం రిటర్న్

మెదక్ జిల్లాలో 520 రేషన్ దుకాణాలు ఉన్నాయి. 1,99,917 రేషన్‌కార్డులుండగా, లబ్ధిదారులకు ప్రతినెలా 4,372.469 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు. సగం కుటుంబాలు కూడా ఇంటికి బియ్యం తీసుకెళ్లడం లేదు. భారీ మొత్తంలో బియ్యం రేషన్ దుకాణాల నుంచి అక్రమంగా రైస్‌మిల్లులకు తరలిస్తున్నారు.

పెద్దశంకరం పేట, అల్లాదుర్గం, టేక్మాల్, పాపన్నపేట, రామాయంపేట మండలా ల్లో ఈ దందా జోరుగా సాగుతోంది. పలు సందర్భాల్లో సీసీఎఫ్ పోలీసులు బియ్యాన్ని పట్టుకొని కేసులు నమోదు చేశారు. ఇలా రోజూ ఎక్కడో ఒకచోట రేషన్ బియ్యం దొరుకుతూనే ఉంది.

ప్రతినెలా 28వ తేదీ నుంచే బియ్యం కోటా గోదామ్ నుంచి రేషన్ షాప్‌కు బియ్యం చేరిన రోజునుంచే నిఘా పెట్టాల్సి ఉన్నా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి.