20-03-2025 05:23:59 PM
పోలీసులకు ఫిర్యాదులో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఐలి ప్రసాద్...
మంథని (విజయక్రాంతి): మంథనిలో సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఐలి ప్రసాద్ మంథని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుపై ఉద్దేశ్యపూర్వకంగా అనుచిత వ్యాఖ్యలు, తప్పుడు ఆరోపణలు, అసభ్యకరమైన పదజాలం వాడుతూ కొండ రవీందర్ మాట్లాడిన వీడియో పోస్ట్ ను కావాలని సోషల్ మీడియాలో పుట్ట ముఖేష్ అన్న వాట్సాప్ గ్రూప్ లో బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఇంచార్జ్ బండారి శ్రీకాంత్ పెట్టాడని, ఈ వ్యక్తి ప్రతిసారి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నాడని, ఇటువంటి దుష్ప్రచారల వల్ల మా నాయకులు పోలు శివ, రాథరపు నితిష్, జంజర్ల రాకేష్ నాకు ఫోన్ చేసి ఈ విషయాలను వారు సోషల్ మీడియాలో చూసి చెప్పి బాధపడగా, దీని వల్ల ప్రజల్లో ఒక అయోమయ వాతావరణం ఏర్పడి ఇరుపార్టీల మధ్యలో ఘర్షణలు జరిగే అవకాశం ఉందని కావునా తప్పుడు పోస్టు పెడుతూ సమాజంలో శాంతి భద్రతలకు భంగం కలిగిస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోగలరని మంథని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పోలు శివ, యువజన కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు పెంటారి రాజు, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి బండ కిషోర్ రెడ్డి, ఎన్ ఎస్ యు ఐ మండల అధ్యక్షులు జంజర్ల శైలేందర్, యూత్ కాంగ్రెస్ నాయకులు పెరుగు తేజ, కౌటం సాయి కిరణ్ పటేల్ రాధారపు నితీష్, తదితరులు పాల్గొన్నారు.