calender_icon.png 22 November, 2024 | 8:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శత్రు ఆస్తుల లెక్క తేల్చండి

22-11-2024 02:25:58 AM

  1. వచ్చే ఏడాది జనవరి తొలి వారంలోగా నివేదిక ఇవ్వండి
  2. సెపీ అధికారులకు కేంద్ర మంత్రి సంజయ్ ఆదేశం

హైదరాబాద్, నవంబర్ 21 (విజయక్రాం తి): తెలంగాణలో కస్టోడియన్ ప్రాపర్టీ ఆఫ్ ఇం డియా (సెపీ) సంరక్షణలో ఉన్న శత్రు ఆస్తుల (ఎనిమీ ప్రాపర్టీ) లెక్క తేల్చాలని అధికారులను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సం జయ్ కుమార్ ఆదేశించారు.

రాష్ర్టంలోని హై దరాబాద్, రంగారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్ జిల్లాల్లో శత్రు ఆస్తుల వివరాల విచారణను వచ్చే నెలాఖరు నాటికి పూర్తి చేసి, జనవరి మొదటి వారంలో నివేదిక ఇవ్వాలని కోరారు. గురువారం హైదరాబాద్‌లోని హోట ల్ మారియట్‌లో ఎనిమీ ప్రాపర్టీకి సంబంధించి సమీక్ష నిర్వహించారు.

తెలంగాణలోని ఎనిమీ ఆస్తుల వివరాలపై దాదాపు 2 గంటలపాటు ప్రత్యేకంగా సమీక్షించారు. రాష్ర్టవ్యాప్తం గా 234 శత్రు ఆస్తులన్నాయని పేర్కొన్న అధికారులు రంగారెడ్డిలో 180, హైదరాబాద్‌లో 44, కొత్తగూడెంలో 7, వికారాబాద్ లో 3 శత్రు ఆస్తులున్నాయని వివరించారు. వీటిలో మెజారిటీ స్థలాలు అక్రమణలకు గురయ్యాయని, నిర్మాణాలు కూడా ఉన్నాయని తెలిపారు.

రం గారెడ్డి జిల్లాకు సంబంధించి మియాపూర్, కొ త్వాల్ గూడ, చిక్కడపల్లి, ముషీరాబాద్ తోపా టు పాతబస్తీలోనూ విలువైన ఆస్తులు అన్యాక్రాంతమైనట్లు అధికారులు మంత్రికి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తక్షణ మే ఆయా ఆస్తుల రికార్డుల పరిశీలన, సర్వే నిర్వహణకు సెపీ ఆధ్వర్యంలో ప్రత్యేక టీం ఏ ర్పాటు చేయాలని ఆదేశించారు.

రాష్ర్ట ప్రభు త్వం తరపున రికార్డుల పరిశీలన, సర్వే నిర్వహ ణ కోసం ప్రత్యేకంగా బృందాన్ని ఏర్పాటు చే యాలని కోరారు. వీరిద్దరి ఆధ్వర్యంలో జా యింట్ కమిటీగా ఏర్పాటై డిసెంబర్ నెలాఖరులోపు రికార్డుల పరిశీలనతోపాటు సర్వే పూర్తి చేయాలని ఆదేశించారు. జనవరి తొలి వారానికల్లా రాష్ట్రంలోని ఎనిమీ ఆస్తుల వివరాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని కోరారు.

ఆ నివేదిక ఆధారంగా శత్రు ఆస్తులపై తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.  సమావేశంలో సెపీ ముంబై విభాగ అధికారులతోపాటు రెవిన్యూ ముఖ్య కార్యదర్శి, సీసీఎల్‌ఏ నవీన్ మిట్టల్, హోంశాఖ సహాయ మంత్రి వ్యక్తిగత కార్యదర్శి అండ్ర వంశీ, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి, హైదరాబాద్, సికింద్రాబాద్, వికారాబా ద్ రెవెన్యూ అధికారులు హాజరయ్యారు. 

 ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ పనితీరు భేష్..

 నిందితులను పట్టుకునేందుకు దోహదపడే వ్యవస్థ సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబోరేటరీ (సీఎఫ్‌ఎస్‌ఎల్) అని బండి సంజయ్ అన్నారు.   కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ ప్రమాణాలతో సీఎఫ్‌ఎస్‌ఎల్ సంస్థను తీర్చిదిద్దిందని పేర్కొన్నారు. గురువారం హైదరాబాద్ రామాంతా పూర్‌లోని సీఎఫ్‌ఎస్‌ఎల్, నేషనల్ సైన్స్ ఫోరెన్సిక్ లాబోరేటరీ(ఎన్సీఎఫ్‌ఎల్), సెంట్రల్ డిటెక్టివ్ ట్రైనింగ్ ఇన్ స్టిట్యూట్ (సీడీటీఐ) సంస్థలను కేంద్ర మంత్రి సందర్శించి ప్రతి విభాగాన్ని పరిశీలించారు.

అధికారులతో సమావేశమై  వాటి పనితీరును తెలుసుకున్నారు. నేర పరిశోధనకు అవసరమైన ప్రామాణిక పత్రాలను సీఎఫ్‌ఎల్‌ఎల్ అందజేస్తోందని అధికారులు  వివరించారు. కేంద్రం నుంచి అవసరమైన సహాయ సహకారాలను అందించేందుకు తగిన ప్రతిపాదనలను కోరారు.

ఇప్పటివరకు 39,167 పోలీసులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, న్యాయవాదులకు సీటీడీఐ అధికారులు ప్రత్యేక శిక్షణనివ్వడంతోపాటు సైబర్ నేరాలపై విద్యార్థులకు ప్రత్యేక అవగాహన కల్పిస్తున్న విషయాన్ని తెలుసుకున్న కేంద్ర మంత్రి సంస్థ అధికారులను ప్రత్యేకంగా అభినందించారు.