calender_icon.png 7 February, 2025 | 10:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వేసవిలో నీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకోండి

07-02-2025 07:36:34 PM

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో అన్ని గ్రామ పంచాయతీలో మున్సిపాలిటీలో 100% పనులు వసూలు చేసి నీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో పంచాయతీరాజ్ మిషన్ భగీరథ విద్యుత్ శాఖ మున్సిపల్ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. మార్చు 31 వరకు ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో మున్సిపాలిటీ గ్రామపంచాయతీలో 100% పనులు వసూలు చేయాలని సిబ్బందికి సూచించారు. నీటి ఎద్దడి అడుగున గ్రామాలను పట్టణాలను వాడులను గుర్తించి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గిరిజన తండాలు గూడాలో అధికారులు పర్యటించాలని వారి సమస్యలను అడిగి పరిష్కారం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ మిషన్ భగీరథ ఈ సందీప్ విద్యుత్ శాఖ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.