06-03-2025 12:00:00 AM
డీపీఓ టీ సాయిబాబా
ఆందోల్ మార్చి 5 : రాబోయే వేసవిలో గ్రామాల్లో మంచినీటి ఎద్దడి నివారణ కోసం అధికారులందరూ అప్రమత్తమై ఉండాలని జిల్లా పంచాయతీ అధికారి టి సాయిబాబా ఆదేశించారు. బుధవారం నాడు స్థానిక వాసవి కల్యాణ మండపంలో ఆందోల్ నియోజకవర్గం గ్రామ కార్య దర్శిలకు, జాతీయ ఉపాధి హామీ పథకం ఫీల్ అసిస్టెంట్లతో విస్తృత స్థాయి సమా వేశాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా డిపిఓ సాయిబాబా మాట్లాడుతూ గ్రామా ల్లో పారిశుద్ధ్య సమస్యలను తొలగించాలని, గ్రామాల్లో నిత్యం మురికి కారులను శుభ్ర పరచాలని, చెత్తాచెదారం లేకుండా అంటు వ్యాధులు ప్రబలకుండా తగు జాగ్ర త్తలు తీసుకోవాలని సూచించారు.
రాబోయే వేసవిలో నీటి ఎద్దడి లేకుండా అధికారులు అందరూ అప్రమత్తంగా ఉండి సరైన చర్య లు తీసుకోవా లన్నారు. డిఎల్‌పి ఓ అనిత, అడిషనల్ డిఆర్‌డిఓ బాలరాజ్, ఎంపీడీవో లు, ఎంపీవో లు, ఏపీఓ లు, టి ఏ లు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.