వ్యాధి నిర్ధారణ పరీక్షలు పెంచండి: అధికారులతో కలెక్టర్ విజయేందిర బోయి
మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 4 (విజయక్రాంతి): క్షయ వ్యాధి నివారణకు చర్యలు తీసుకుంటూ వ్యాధి నిర్ధారణ పరీక్షల సంఖ్యను పెంచాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. మంగళవారం కలెక్టర్ ఛాంబర్లో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ టీబి రోగులకు చేయూతనివ్వడం, టీబి పై అవగాహన కల్పించాలని సూచించారు.
100 రోజుల (నిక్షయ్ శిబిరం) టి.బి. ను ముందుగా గుర్తించుటకు అవసరమైన ఎక్స్ రే లను పెంచాలని, ఎన్.టి.ఈ.పి. సిబ్బంది వీలైనంత ఎక్కువ మంది ప్రజలకు పరీక్షలు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. టి.బి. వ్యాధి ఉన్నట్లు రోగులకు పరీక్షించే ఎక్స్ రే, ఎన్.ఎ.ఎ.టి. పరీక్షల సంఖ్య జిల్లాలో చాలా తక్కువగా వుందని రాష్ర్ట కమిషనర్ ద్వారా వచ్చిన లేఖలో వుందని కలెక్టర్ తెలిపారు.
అందుకు నీక్షయ్ పోర్టల్ లో సమస్యలు ఉన్నాయని అందుకే డేటా అప్లోడ్ చేయడానికి ఆలస్యం అయిందని, ఈ సమస్యను పరిష్కరించుకుని త్వరితగతిన పూర్తి చేస్తామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ కష్ణ జిల్లా కలెక్టర్ కు వివరించారు. నియమ నిబంధనలు పాటిస్తూ వ్యాధి నివారణకు సంబంధించిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో డిఎంహెచ్‌ఓ డాక్టర్ కష్ణ, డి ఐ ఓ డాక్టర్ పద్మ, డాక్టర్ భాస్కర్ నాయక్ , డాక్టర్ బ్లెస్సీ,గోపాలకష్ణ , కోఆర్డినేటర్ పాల్గొన్నారు.