calender_icon.png 20 March, 2025 | 3:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులకు ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టండి

17-03-2025 12:00:00 AM

కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

పాల్వంచ మార్చి 16 (విజయక్రాంతి) :  కిన్నెరసాని ఎడమ కాలువ దిగువన ఉన్న రైతులకు ఇబ్బంది లేకుండా సాగునీరు అందించాలని యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. ఆదివారం మండల పరిధిలోని కిన్నెరసాని ఎడమ కాలువను అధికారులు, రైతులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాగు రైతుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడానికి రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి నిధులు మంజూరు చేయిస్తానని, తక్షణమే అధికార యంత్రాంగం  పంట పొలాలు ఎండిపోకుండా అదనపు మోటర్లు కేటాయించి నీళ్లు విడుదల చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి SK సాబీర్ పాషా, రాష్ట్ర సమితి సభ్యులు ముత్యాల విశ్వనాథం, మండల కార్యదర్శి వీసంశెట్టి పూర్ణచంద్రరవు, కాంగ్రెస్ నాయకులు ఎర్రం శెట్టి ముత్తయ్య  జిల్లా సమితి సభ్యులు ఉప్పుశెట్టి రాహుల్, డి సుధాకర్, అన్నారపు వెంకటేశ్వర్లు, శనగారపు శ్రీనివాసరావు, మన్యం వెంకన్న, ఆవుల సతీష్ జకరయ్య, నరహరి నాగేశ్వరరావు, వైఎస్ గిరి, బీవీ సత్యనారాయణ, రెహమాన్, కరీం, లాల్ పాషా, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.