ఉపాధ్యాయుడి సాహసం
ఆదిలాబాద్, సెప్టెంబర్ 9 (విజయక్రాంతి): ప్రభుత పాఠశాలలో ఓ విద్యార్థిని పాము కాటేయడంతో ఓ ఉపాధ్యాయుడు ఏమీ ఆలోచించకుండా నోటితో విషాన్ని తొలగించి కాపాడాడు. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం ధనోర ప్రభుత పాఠశాలలో సోమవారం మధ్యాహ్నం 1వ తరగతి చదువుతున్న యశంత్ కాలును పాము కాటేసింది. ఉపాధ్యాయుడు సురేష్ విద్యార్థి కాలు నుంచి నోటితో విషాన్ని తొలగించాడు. తరాత ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లి ప్రథమ చికిత్స అందించారు.
అక్కడి నుంచి ఆదిలాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రస్తు తం విద్యార్థికి ప్రాణాపాయం తప్పిందని వైద్యులు పేర్కొన్నా రు. దీంతో ఉపాధ్యాయుడు సురేష్‌ను పలు వురు అభినందించారు. పాము కనిపిస్తేనే ఆమద దూరం పరుగెత్తే మనం.. విషాన్ని నోటితో తొల గించి విద్యార్థిని రక్షించడం సాహసమేనని అన్నారు. ప్రాణాలకు తెగించి విద్యార్థిని కాపాడిన ఉపాధ్యాయుడు సురేష్‌కు ఏమిచ్చినా రుణం తీర్చుకోలేమని విద్యార్థి తల్లిదండ్రులు అన్నారు.