calender_icon.png 8 October, 2024 | 4:07 PM

చట్టప్రకారమే చర్యలు తీసుకోండి

04-09-2024 01:34:58 AM

దుర్గంచెరువు ఎఫ్టీఎల్ నోటీసులపై హైకోర్టు

హైదరాబాద్, సెప్టెంబర్ 3 (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గుట్టలబేగంపేట ప్రాంతంలో దుర్గం చెరువు ఎఫ్టీఎల్ ప్రాంతంలో నిర్మాణాల తొలగింపు నిమిత్తం ఇచ్చిన నోటీసులనే షోకాజ్ నోటీసులుగా పరిగణించాలంటూ హైకోర్టు మరోసారి స్పష్టతనిచ్చింది. బాధితులు ఇచ్చే వివరణను తీసుకుని చట్టప్రకారం ముందుకెళ్లాలంటూ ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది. దుర్గంచెరువు ప్రాంతానికి సం బంధించి అధికారులు జారీచేసిన కూల్చివేత నోటీసులను సవాలు చేస్తూ దాఖలైన దాదాపు 20 పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే, జస్టిస్ జే శ్రీని వాసరావుతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. వీటితోపాటు వరంగల్‌లోని  భద్రకాళి చెరువులో ఆక్రమణల తొలగింపునకు జారీ చేసిన నోటీసులపై కూడా పిటిష న్లు దాఖలయ్యాయి. నోటీసులపై వివరణ ఇవ్వడానికి పిటిషనర్లకు 10 రోజుల గడువు ఇచ్చి, వారి వివరణ తీసుకున్నాక చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ విచారణను మూసివేసింది.