ఎమ్మెల్యే కృష్ణారావుకు ఆశ కార్యకర్తల వినతి
కూకట్పల్లి, జూలై 18: తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించేలా చొరవ చూపాలని కోరుతూ ఆశ కార్యకర్తలు గురువారం కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుకు వినతిపత్రం అందజేశారు. తమ డిమాండ్లను పరిష్కరించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఎమ్మెల్యేకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బీఆర్ఎస్ తరఫున అసెంబ్లీలో చర్చించి ఆశ కార్యకర్తలకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ధర్నా..
రాజేంద్రనగర్: తమకు సర్కారు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తే సీఐటీయూ ఆధ్వర్యంలో ఆశ కార్యకర్తలు రాజేంద్రనగర్లోని ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ క్యాంపు కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు. సీఐటీయూ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు జాజాల రుద్రకుమార్, సహాయ కార్యదర్శి ఎస్ రామ్మోహన్రావు, సీఐటీయూ తెలంగాణ ఆశ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి సునీత తదితరులు ధర్నాలో పాల్గొన్నారు.