calender_icon.png 2 November, 2024 | 4:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భద్రాచలం విలీన గ్రామాలపై చొరవ తీసుకోండి

03-07-2024 12:25:17 AM

సీఎంరేవంత్ రెడ్డికి మంత్రి తుమ్మల లేఖ

హైదరాబాద్, జూలై 2 (విజయక్రాంతి): తెలంగాణ, ఏపీ సీఎంలు రేవంత్ రెడి,్డ చంద్రబాబు ఈ నెల 6న భేటీ కానున్న నేపథ్యంలో ఏపీలో విలీనమైన ఎటపాక, గుండాల, పురుషోత్తమపట్నం, కన్నాయిగూడెం, పిచుకులపాడు గ్రామ పం చాయితీలను భద్రాచలంలో కలిపేలా చొరవ తీసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డిని మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు కోరారు. ఈ మేరకు మంగళవారం ఆయన సీఎంకు లేఖ రాశారు. రాష్ర్ట విభజన నేపథ్యంలో ఏడు మండలాలను ఏపీలో విలీనం చేస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. భద్రాచలం పట్టణం మినహా మిగతా గ్రామాలు ఏపీలో విలీనమయ్యాయని పేర్కొన్నారు. భద్రాచలం పట్టణ శివారు నుంచి ఏపీలో విలీనమవ్వడంతో డంపింగ్ యార్డుకు స్థలం లేకుండా పోయిందని లేఖలో పేర్కొన్నారు.

భద్రాచలం నుంచి చర్ల ప్రధాన రహదారిలో ఉన్న ఎటపాక ఆంధ్రాలో కలవడంతో అంతరాష్ర్ట సరిహద్దు సమస్యలు వస్తున్నాయని గుర్తుచేశారు. భద్రాచలం రామాలయం దేవస్థానం భూములు పురుషోత్తమపట్నం గ్రామంలో ఉండటంతో భూములపై ఆలయ అధికారులు పర్యవేక్షణకు పాలనాపరమైన ఇబ్బందులు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. పట్టణాన్ని ఆనుకొని పంచాయితీల వారు తెలంగాణలో కలపాలంటూ తీర్మానాలు కూడా చేశారని గుర్తు చేశారు. ప్రజా విజ్ఞప్తులు దృష్టిలో పెట్టుకొని 5 గ్రామ పంచాయితీలను ఇద్దరు ముఖ్యమంత్రులు పరిపాలనా సౌలభ్యం, ప్రజా సంక్షేమం కోసం భద్రాచలంలో కలిపేలా నిర్ణయం తీసుకోవాలని మంత్రి తుమ్మల లేఖలో విజ్ఞప్తి చేశారు.