calender_icon.png 13 January, 2025 | 4:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆందోళన చెందకుండా పరీక్షలు రాయండి

22-10-2024 01:59:07 AM

గ్రూప్ 1 అభ్యర్థులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు 

హైదరాబాద్, అక్టోబర్ 21 (విజయక్రాంతి): రాష్ట్రంలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు హాజరవుతున్న అభ్యర్థులకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈమేరకు సోమవారం ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. “గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు హాజరవుతున్న అభ్యర్థులకు నా శుభాకాంక్షలు. ఎటువంటి ఆందోళన చెందకుండా పూర్తి ఏకాగ్రతతో పరీక్షలు రాయండి.

ఈ పరీక్షల్లో మీరు విజయం సాధించి తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కాగా ప్రత్యేక రాష్ట్రంలో గ్రూప్-౧ మెయిన్స్‌ను నిర్వహించడం ఇదే తొలిసారి. గ్రూప్-౧ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి.