19-03-2025 02:30:02 AM
ఏఎస్పి చిత్తారంజన్
కుమ్రం భీం ఆసిఫాబాద్, మార్చి 18 ( విజయక్రాంతి): ఒత్తిడి లేకుండా పరీక్షలు రాయాలని పదవ తరగతి విద్యార్థులకు ఏ ఎస్ పి చిత్తరంజన్ సూచించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని జడ్పీ బాలికల పాఠశాలలో విద్యార్థిని, విద్యార్థులకు పరీక్షా సామాగ్రిని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరీక్ష నిర్వాణలో భాగంగా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందని విద్యార్థులకు పరీక్ష రాసేందుకు కావలసిన పెన్ను, ప్యాడ్ ,స్కేల్, వాటర్ బాటిల్ తదితర వస్తువులను పోలీసులు మీకోసం కార్యక్రమంలో భాగంగా అందజేయడం జరుగుతుందన్నారు.
పరీక్షకు ఒక రోజు ముందుగానే అన్ని సిద్ధం చేసుకోవాలని సమయానికి ఆందోళన పడకుండా కేంద్రాలకు గంట ముందుగా చేరుకోవాలని సూచించారు. ప్రతి విద్యార్థి తమ పాఠశాలలో పరీక్షలు రాస్తారని అదేవిధంగా వార్షిక పరీక్షలు ఇతర పాఠశాలల్లో నిర్వహించడం జరుగుతుందని ఆందోళన చెందవలసిన అవసరం లేదని తెలిపారు.
ఫ్రీ ఫైనల్ పరీక్షలను ఏ విధంగా అయితే రాశారో అదేవిధంగా వార్షిక పరీక్షలను ఎలాంటి భయం లేకుండా రాయాలని సూచించారు. పరీక్షలు సమీపిస్తున్నందున సబ్జెక్టులను రివిజన్ చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐ రవీందర్ ,ఎంఈఓ రాథోడ్ సుభాష్ ,ప్రధానోపాధ్యాయుడు సుభాష్, ఉపాధ్యాయులు హేమంత్ ,రమేష్ తదితరులు పాల్గొన్నారు.