calender_icon.png 25 March, 2025 | 1:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి

22-03-2025 12:30:54 AM

సూర్యాపేట, మార్చి 21: నేటి పోటీ ప్రపంచంలో కాలంతో పరుగులు పెడుతూ ప్రజలు వారి ఆరోగ్యంపై శ్రద్ధ చూపడం లేదని, ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యం విషయంలో శ్రద్ధ తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే, లయన్స్ క్లబ్ కంటి ఆసుపత్రి కమిటీ చైర్మన్ దోసపాటి గోపాల్, టెక్స్టైల్స్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గండూరి శంకర్, 45వ వార్డు మాజీ కౌన్సిలర్ గండూరి పావని కృపాకర్ లు అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని విద్యానగర్లో ఏర్పాటుచేసిన మెగా ఉచిత వైద్య శిబిరాన్ని వా రు ప్రారంభించి మాట్లాడారు.