05-04-2025 02:19:06 AM
హైదరాబాద్ మహానగరం అందమైన పరిశుభ్రత కలిగిన నగరం అని గతంలో ఘనంగా కీర్తనలు పొందింది. 1973లో ఈ మేరకు ఆబిడ్స్ జనరల్ పోస్టాఫీస్ ముందర ఒక బోర్డు కూడా ఉండేది. రాన్రాను పెరుగుతున్న జనాభా, నివాసగృహాల సముదాయాలు, ఆకాశహర్మ్యాలు, పరిశ్రమలు, వ్యాపార వాణిజ్య కేంద్రాలు, ప్రభుత్వ కార్యాలయాలు విస్తృత స్థాయిలో ఏర్పడ్డాయి. అయితే, ఈ స్థాయికి తగ్గట్టు సమయానుకూలమైన యాజమాన్య పద్ధతులు, పర్యవేక్షణ మాత్రం కొరవడింది. ఫలితం ఆనాటి సౌందర్యాన్ని నగరం కోల్పోయిందన్న బాధ అప్పటి తరం వారిలో నెలకొంది.
నగరాన్ని ఉదయం వేళల్లో శుభ్ర పరచడానికి సఫాయి ఉద్యోగులు తమ శక్తి వంచన లేకుండా అన్ని కాలాల్లోనూ విధులను నిర్వహిస్తున్నారు. వీరి సేవలకు పాదాభివందనం చేయవలసిందే. ముఖ్యంగా స్త్రీ కార్మికుల పాత్ర ప్రశంసనీయం. వీధులను ఊడ్వడానికి ఏడాదికి ఒకసారి చీపురు కట్టలను, తమ ఆరోగ్య రక్షణకు కావలసిన చేతి గ్లౌజులు, మాస్కులు, చేతులు శుభ్రం చేసుకోవడానికి హ్యాండ్‌వాష్‌తో కూడిన కిట్స్‌ను అందజేసే వారని ఈ ఉద్యోగులు అంటున్నారు. ప్రస్తుతం ఇవేవీ అందించడం లేదని వారు వాపోతున్నారు.
-దండంరాజు రాంచందర్‌రావు, పాత బోయిన్‌పల్లి
రూ.10 పెన్షన్ ఫండ్ కోసం..
ప్రస్తుతం కోల్ ఇండియా లిమిటెడ్ ద్వారా టన్నుకు రూ. 10 చొప్పున పెన్షన్ నిధికి జమ అవుతున్నది. ఇక నుంచి అదనంగా టన్నుకు మరో రూ.10 అదనంగా జమ చేస్తామని బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ లిమిటెడ్, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌కు సమాచారం అందినట్టు తెలుస్తున్నది. కోల్‌కత్తాలో జరిగిన బోర్డు సమావేశంలో ఇతర విషయాలతోపాటు 10 రూ.ల పెంపును ఆమోదించినట్లు యాజమాన్యం తెలియజేసింది. కోల్ మైన్స్ పెన్షన్ ఫండ్- 1998 నిధికి సహకారం కోసం కోల్ ఇండియాలోని నియంత్రితచ నియంత్రితేతర రంగాలకు బొగ్గు నోటిఫైడ్ ధరలో ప్రస్తుతం ఉన్న రూ. టన్నుకు 10 నుంచి రూ. 20, నాన్-కోకింగ్‌కు రూ. కోకింగ్ బొగ్గుకు టన్నుకు 10 రూపాయలు అదనం. ఇది ఏప్రిల్ 16, 2025 నుంచి అమల్లోకి వస్తుందని భావిస్తున్నారు. గతంలో జరిగిన కోల్ మైన్స్ ప్రావిడెంట్ ఫండ్ బోర్డ్ ఆఫ్ ట్రస్ట్ సమావేశంలో పెన్షన్ నిధిని బలోపేతం చేయడానికి టన్నుకు రూ. 10 చొప్పున ఎక్కువ ఇవ్వాలని ఏకాభిప్రాయం కుదిరిందని విషయం అందరికీ తెలిసిందే. ఈ దృష్ట్యా సింగరేణి యాజమాన్యం కూడా ప్రతి టన్ను బొగ్గుపై రూ.10 పెన్షన్ ఫండ్‌కు జమ చేయాలని సింగరేణి విశ్రాంత ఉద్యోగులు కోరుతున్నారు.
-ఆళవందార్ వేణుమాధవ్, హైదరాబాద్