రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలలో క్రీడలకు ఆదరణ కరువవుతున్నది. పూర్వపు రోజుల్లో ప్రతీ గ్రామంలో యువజన సం ఘాలద్వారా వివిధ ఆటలు ఆడించే వారు. జాతీయ, రాష్ట్ర స్థాయిలలో పతకాలు సాధించే వారు కూడా. నేడు ఊళ్లలో ఆట లు అంతరించి పోవడం బాధాకరం. ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలలో క్రీడల అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకోవాలి. అప్పుడే క్రీడా రంగంలో రాష్ట్రం అగ్రగామిగా నిలిచే అవకాశం లభిస్తుంది.
- కామిడి సతీశ్‌రెడ్డి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా