రాష్ట్రంలో ప్రజలు ఆనేక సమస్యలతో సతమతవుతున్నారు. ప్రజల కోసం ఆలోచించే నాథుడే లేడు. నిత్యావసరాల ధరలు భారీగా పెరిగాయి. దీనిపై అటు ప్రభుత్వం, ఇటు ప్రతిపక్షం దృష్టి పెట్టడం లేదు. వాళ్లకు ఎంతసేపు పరస్పర నిందలు, వ్యక్తిగత దూషణలు చేసుకోవడంతోనే సరిపోతున్నది. సీజనల్ వ్యాధులు ఎక్కువవుతున్నాయి. ఆయా ప్రభుత్వ ఆసుపత్రులలో బెడ్స్, మందుల కొరత తీవ్రంగా ఉంటున్నది. దోమలు విజృంబిస్తున్న్నాయి. ప్రజలలో మలేరియా, దెంగ్యు, విష జ్వరాలు అధికమవుతున్నాయి. ఇకనైనా నేతలు వీటిపై దృష్టి పెట్టాలి.
శ్రిష్టి శేషగిరి, సికింద్రాబాద్