calender_icon.png 24 October, 2024 | 7:47 AM

పిల్లలూ.. జాగ్రత్త!

08-06-2024 12:05:00 AM

కొన్ని ఆన్‌లైన్ గేమ్స్ ఎంత ప్రమాదకరమైనవి అంటే.. ఓ స్టేజ్ తర్వాత కొందరు ఆ గేమ్‌లో పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోతారు. ఓ రకంగా ఆ గేమ్‌కి బానిస లైపోతారు. అక్కడ ఇన్‌స్ట్రక్షన్‌లో ఏముంటే అవి గుడ్డిగా చేస్తూ పోతారు. తప్పా? ఒప్పా? అన్న ఆలోచన కూడా ఉండదు, కనీసం దాన్ని గుర్తించలేరు కూడా. చివరకు ఆ గేమ్ మాయలో పడి కొందరు సూసైడ్ కూడా చేసుకుంటారు. ఎందుకంటే సోషల్ మీడియా గేమ్స్ పిల్లలు, పెద్దలు అన్న తేడా లేకుండా అందరినీ అట్రాక్ట్ చేసే జిమ్మిక్కులు ఉంటాయి. 

గంటల తరబడి స్క్రీన్ ముందు కూర్చోవడం వల్ల పిల్లల మెదడు పై చెడు ప్రభావం ఎక్కువగా ఉంటుందని ప్రపంచంలోని అన్ని రకాల పరిశోధనలు చెబుతున్నాయి. మొబైల్ ఫోన్లు, గాడ్జెట్స్, టీవీ చూడటం వంటి వాటికి అలవాటు పడటం వల్ల పిల్లల భవిష్యత్తు చెడిపోతుందని నివేదికలు పేర్కొంటున్నాయి. దీని కారణంగా, ‘వర్చువల్ ఆటిజం’ ప్రమా దం గణనీయంగా పెరుగుతుంది. 

వర్చువల్ ఆటిజం..

వర్చువల్ ఆటిజం అనేది ఎక్కువగా 4 ఏండ్ల వయసు గల పిల్లలలో కనిపిస్తుంది. ఇది ఎక్కువగా మొబైల్ ఫోన్లు, టీవీ, కంప్యూటర్ల అధిక వినియోగం వల్ల వస్తుంది. స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలను ఎక్కువగా ఉపయోగించడం వల్ల పిల్లల ఆరోగ్యానికి చాలా హానికరం. అంతే కాదు ఇతరులతో మాట్లాడానికి కూడా భయపడతారు.. ఇబ్బంది పడతారు. ఎక్కువగా ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు. 1 సంవత్సరాల వయసు ఉన్న పిల్లల వర్చువల్ ఆటిజం ప్రమాదంలో ఉన్నారు. పిల్లలు ఫోన్ ద్వారా మాట్లాడటం నేర్చుకుంటున్నారని తల్లిదండ్రులు చాలాసార్లు అనుకుంటారు. కానీ అది పిల్లలకు చాలా ప్రమాదకరం. 

గాడ్జెట్స్‌తో ప్రమాదం..

పిల్లలపై ఫోన్‌లు చాలా చెడు ప్రభావం చూపుతాయి. దీంతో వారు బాహ్యప్రపంచంతో అంత ఈజీగా కలవారు. పిల్లలు గాడ్జెట్స్‌లతో బిజీగా మారడం వల్ల వారికి మాట్లాడటంలో ఇబ్బందికి గురవుతుంటారు. దీంతో పిల్లలు మొండిగా మారడం చాలాసార్లు చూసే ఉంటాం. ఫోన్ల వల్ల పిల్లలు దూకుడుగా మారతారు. తల్లిదంద్రులు తమ పిల్లలు ఏడవకుండా ఉండేందుకు గాడ్జెట్స్ ఇవ్వడం చాలాసార్లు కనిపిస్తుంది. దీని కారణంగా పిల్లల నిద్ర విధానం చెడిపోతుంది. రెండు సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలు మొబైల్ లేదా టీవీ అలవాట్లకు గురికాకుండా చూసుకోవాలి. 2 ఏళ్లలోపు పిల్లలకు కొంతకాలం టీవీకి, స్మార్ట్ ఫోన్‌కు దూరంగా ఉండేలా చూసుకోవాలి.