calender_icon.png 3 October, 2024 | 8:05 AM

మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోండి

03-10-2024 01:45:03 AM

సినీ ప్రముఖుల జీవితాలను రాజకీయాలకు వాడుకోకండి 

మంత్రి కొండా సురేఖకు నటుడు నాగార్జున సూచన 

హైదరాబాద్, అక్టోరబ్ ౨ (విజయక్రాంతి) : మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై  సినీ నటుడు అక్కినేని నాగార్జున ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్స్ వేదికగా స్పందించారు. తమ కుటుంబంపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలను, మీ ప్రత్యర్థులను విమర్శించేందుకు వాడుకోకండని హితవు పలికారు.

దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలను గౌరవించండని సూచిం చారు. బాధ్యత గల పదవిలో ఉన్న మహిళ గా మంత్రి చేసిన వ్యాఖ్యలు, తమ కుటుం బం పట్ల చేసిన ఆరోపణలు పూర్తిగా అసంబద్ధం, అబద్ధమని స్పష్టంచేశారు. తక్షణమే మంత్రి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని కోరారు.

అంతకు ముందు ప్రముఖ నటుడు ప్రకాశ్‌రాజ్ సైతం మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలను ఖండించారు. సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఆయన.. ‘ఏంటీ ఈ సిగ్గులేని రాజకీయాలు.. సినిమా ల్లో నటించే ఆడవాళ్లంటే ఇంత చిన్న చూపా?.. జస్ట్ ఆస్కింగ్’ అంటూ కామెంట్స్ చేశారు.