17-03-2025 02:14:55 AM
కేంద్రమంత్రి బండి సంజయ్ కి కరీంనగర్ ఆర్యవైశ్య నేతల విజ్ఞప్తి
కొత్తపల్లి, మార్చి 16 (విజయ క్రాంతి): పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ పేరు మార్చకుండా తగిన చర్యలు చేపట్టాలని ఆర్యవైశ్య నేతలు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కరీంనగర్ పట్టణంలో ఆదివారం పొట్టి శ్రీరాములు జయంతి కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. అనంతరం పొట్టి శ్రీరాములు జయంతిని పురస్కరించుకొని ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అల్పాహార కార్యక్రమాన్ని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు కన్న కృష్ణ, మాజీ అధ్యక్షులు బుస్స శ్రీనివాస్, పట్టణ సంఘం అధ్యక్షుడు నగునూరిరాజేందర్, ఉపాధ్యక్షులు కొడిత్యాల సురేష్ ,సంతోష్, జనరల్ సెక్రటరీ పెద్ది వేణుగోపాల్ , కోశాధికారి సుద్దాల వెంకటేష్ యువజన సంఘం అధ్యక్షుడు జీడిగే సాయికృష్ణ , కరీంనగర్ ఆర్యవైశ్య ప్రముఖులు ,సేవ కేంద్రం డైరెక్టర్లు, అభ్యుదయ సంఘం, వాసవి క్లబ్ ప్రతినిధులు ఏ వి మల్లికార్జున్, పొట్టి శ్రీరాములు ఫౌండేషన్ అధ్యక్షుడు ఉప్పల రామేశం,కొంజర్ల శ్రీకాంత్, జిల్లా సంఘం ప్రధాన కార్యదర్శి కొమురవెల్లి వెంకటేశం, జిల్లా యువజన సంఘం అధ్యక్షుడు జీడిగే సాయి కృష్ణ, పట్టణ యువజన సంఘం అధ్యక్షుడు తణుకు సాయి కృష్ణ, జిల్లా మహిళా అధ్యక్షురాలు చకిలం స్వప్న, పట్టణ మహిళా సంఘం అధ్యక్షురాలు రావికాంటి భాగ్యలక్ష్మి, గుండా చంద్రమౌళి, తోడుపునూరి రాకేష్, కొండూరి సత్యనారాయణ,దొంతుల మనోహర్, సుర శ్రీనివాస్, పైడా శ్రీనివాస్, నలుమాచు విజయ్, పెద్ది శ్రీనివాస్, రాచామల్ల భద్రయ్య, గర్రెపల్లి శ్రీకాంత్, కేశెట్టి మహేష్, కాచం మహేష్, తోడుపునూరి హరి, అలెంకి సంతోష్,మెహెర్, అమరేందర్, కన్న సాయి, సూరజ్, రాహుల్, రామిడి శ్రీధర్, రేగురి మారుతి, పుల్లూరి అశోక్, కైలాస నవీన్, పబ్బ జ్యోతి, విశ్వనాధం తదితరులు పాల్గొన్నారు.