15-03-2025 11:45:35 PM
యూనియన్ బ్యాంక్ సిద్దిపేట రీజినల్ హెడ్ ఎడ వికాస్
మొగుడంపల్లి: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సేవలను ప్రజలు మరింతగా వినియోగించుకోవాలని సిద్దిపేట రీజినల్ హెడ్ ఎడ వికాస్ సూచించారు. శనివారం మొగుడంపల్లి మండల కేంద్రంలో డిపాజిట్-విత్‌డ్రా ఏటీఎం మిషన్‌ను ప్రారంభించారు. బ్యాంకు సేవలను విస్తరించడంలో భాగంగా, ఈ కొత్త ఏటీఎం మిషన్ ప్రజలకు డిపాజిట్, విత్‌డ్రా సౌకర్యాలను అందించనుందని తెలిపారు. ఖాతాదారులు బ్యాంక్ సేవల్లో కొన్ని సమస్యలను ప్రస్తావించాగా, బ్యాంక్‌లో కరెంట్ సమస్యలు లేకుండా చూడాలని, గోల్డ్ లోన్ సదుపాయాన్ని అందించాలని కోరారు. అలాగే, క్రాఫ్ట్ లోన్ వడ్డీ చెల్లింపుకు బ్రోకర్లను ఆశ్రయించకుండా, వడ్డీతోనే రిన్యూవల్ చేసే అవకాశం కల్పించాలని కోరారు.
ఖాతాదారుల సమస్యలపై స్పందించిన ఎడ వికాస్, వీటిని త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రజలు బ్యాంక్ ద్వారా అందించబడుతున్న సేవలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఇండియన్ బ్యాంక్ మేనేజర్ ముఖేష్, చీఫ్ మేనేజర్ సంజయ్ చౌదరి, డిప్యూటీ బ్రాంచ్ మేనేజర్ జె. ప్రవాస్ కుమార్, దత్తాత్రేయ ఆర్డీవో, జె. రమేష్ ,రంజోల్ బ్రాంచ్ మేనేజర్, హెడ్ క్యాషియర్ శ్రీనివాస్ రెడ్డి, కిష్టయ్య, గ్రామ పెద్దలు చించోలి కర్ ప్రేమ్ కుమార్, ఎండి. కుత్బుద్దీన్, యువ నాయకులు సుభాష్, సందీప్, షేకాపురం రాజు ఖాతాదారులు తదితరులు పాల్గొన్నారు.