calender_icon.png 3 April, 2025 | 2:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ట్రైకార్ సబ్సిడీ రుణాలను సద్వినియోగం చేసుకోవాలి

31-03-2025 12:00:00 AM

బూర్గంపాడు, మార్చి 30(విజయక్రాంతి):- గిరిజన యువతి యువకులు ట్రైకార్ సబ్సిడీ రుణాలను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర షెడ్యూల్ ట్రైబ్స్ కోపరేటివ్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ట్రైకార్ చైర్మన్ తేజవాత్ బెల్లయ్య నాయక్ అన్నారు. ఆదివారం బూర్గంపాడు మండలం లక్ష్మీపురం గ్రామంలోని శ్రీ లక్ష్మీనరసింహ ఎగ్స్ ట్రేస్ ఇండస్ట్రీస్ పినపాక, భద్రాచలం ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు,తెల్లం వెంకట్రావు, ఐటిడిఏ పివో బి. రాహుల్ తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో లభ్యమయ్యే వనరులకు సంబంధించిన సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమలు నెలకొల్పుకొని ఆర్థికంగా అభివృద్ధి దిశగా అడుగులు వేయాలన్నారు.

నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి కల్పించడానికి సీఎం రేవంత్ రెడ్డి రూ 1360 కోట్ల తో రాజీవ్ యువ వికాస పథకాన్ని ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. దాదాపు 5 లక్షల యువతి,యువకులకు ఉపాధి కల్పించే లక్ష్యంతో వినూత్నంగా ప్రారంభించారని, ఈ పథకంలో భాగంగా రాష్ట్రంలోని గిరిజన యువతి యువకులకు ఒక లక్ష 15 వేల మందికి జూన్ రెండు నాటికి తప్పనిసరిగా అందరికీ సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమలు స్థాపించుకొని ఉపాధి పొందేలా సంకల్పించామన్నారు. ఈ కార్యక్రమంలో ట్రైకార్ జిఎం శంకర్రావు, ట్రైకార్ మిషన్ మేనేజర్, లక్ష్మీ ప్రసాద్, ఐటీసీ హెచ్‌ఆర్ జిఎం శ్యామ్ కిరణ్, ఎస్ ఓ భాస్కరరావు, ఏవో సున్నం రాంబాబు, డీఎస్‌ఓ ప్రభాకర్ రావు, మేనేజర్ ఆదినారాయణ, వివిధ శాఖలకు చెందిన అధికారులుపాల్గొన్నారు